Homeఆధ్యాత్మికంHanuman Jayanthi 2024: హనుమాన్ జయంతి రోజు ఇవి చేస్తే స్వామి దయ ఉన్నట్లే..

Hanuman Jayanthi 2024: హనుమాన్ జయంతి రోజు ఇవి చేస్తే స్వామి దయ ఉన్నట్లే..

Hanuman Jayanthi 2024:రామ బంటు అయిన హనుమంతుడికి రామాయణంలో ప్రత్యేక స్థానం ఉంది. బలశాలి, భూత, ప్రేత విముక్తి కలిగించే ఆంజనేయుడిని స్మరించడం వల్ల అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున ఆ రామ భక్తుడను కీర్తించడం ద్వారా శుభయోగాలు జరగనున్నాయి. 2024 ఏడాదిలో ఏప్రిల్ 23న చిన్న హనుమాన్ జయంతిని నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా కొన్ని పనులు చేయడం వల్ల దైవానుగ్రహం పొందుతారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఇంతకీ హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలంటే?

హనుమాన్ జయంతి సందర్భంగా ఊరూ, వాడల్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజే ఈజయంతి రావడంతో హనుమాన్ భక్తలు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో భక్తులు మంగళవారం ఉదయం నుంచే ఆలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా కొన్ని పాటించడం వల్ల స్వామివారు అనుగ్రహిస్తారు.

  • ఆంజనేయుడికి చందనం అంటే ఇష్టం. అందుకే ఆయన కు ఎప్పుడూ చందనంతో అభిషేకం నిర్వహిస్తారు. హనుమాన్ మాల ధరించిన వారు ఈ రంగులో ఉన్న దుస్తులను ధరిస్తారు. అయితే హనుమాన్ జయంతి రోజున చందనం రంగులో ఉన్న దుస్తులను ధరించడం మంచిచి. దీంతో అప్పటి వరకు ఉన్న కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
  • హనుమంతుడికి ప్రసాదంగా ఎక్కువగా శనగపప్పు, బూందీ లడ్డును పెడుతారు. హనుమాన్ జయంతి రోజున వీటిని సమర్పించడం వల్ల హనుమంతుడు ఎంతో సంతోషిస్తారట. అందువల్ల దేవాలయాల్లో ఇంట్లో పూజ సమయంలో ప్రసాదంగా శనగపప్పుకు సంబంధించిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే బూందీ లడ్డును కూడా పెట్టొచ్చు.
  • హనుమాన్ చాలీసాకు ఎంతో ప్రత్యేకం ఉంది. ప్రతీ మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా, సుందరకాండ చదవడం వల్ల శుభం జరుగుతుంది.
  • హనుమాన్ జయంతి రోజు స్వామి వారి అనుగ్రహం పొందాలంటే మద్యం, మాంసం ముట్టకూడదు. వీలైతే ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల హనుమాన్ అనుగ్రహం పొందుతారు.
S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version