
ప్రభుత్వ జీవోలను ఇకపై ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు సర్కారు తెలిపింది. ఏపీ ఈ-గెజిట్ ద్వారా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. GOIR వెబ్ సైట్ ను నిలిపివేసినందున ఆర్టీఐ ప్రయోజనాలకు భంగం కలగకుండా జీవోల వివరాలను ఈ-గెజిట్ లో ఉంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇకపై అన్ని జీవోలు సంబంధిత అధికారి డిజిటల్ సంతకంతో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.