
కరోనాపై పోరులో భారతదేశానికి మద్దతుగా టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ భారీ సాయాన్ని ప్రకటించింది. రూ. 113 కోట్లు అందిస్తామని గూగుల్ సంస్థ గురువారం ప్రకటించింది. ముఖ్యంగా హెల్త్ వర్కర్లకు అదనపు శిక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాల మెరుగు కోసం సుమారు 80 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలిపింది. గివ్ ఇండియా, పాత్ సంస్థలకు ఈ నిధులను అందించనుంది. ఈ రెండు సంస్థలు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తాయి.