
హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అములకు గ్రీన్ సిగ్నల్ లభించింది. పథకం కింద రూ. 500 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. కాగా హుజురాబాద్ లో దళిత బంధు ఫైలెట్ ప్రాజెట్టును నిలుపుదల చేయాలంటూ జనవాహిని పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.