
బంగారం, వెండి ధరలు పెరిగాయి. సోమవారం నిలకడగా ఉన్న బంగారం, వెండి ధరలు మంగళవారం పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 110 పెరగగా 22 క్యారెట్ల బంగారం పై 100 రూపాయాలు పెరిగింది. దేశంలో 24 క్యారెట్ల బంగారం రూ. 48,880 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 44,880 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 51,220 గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 46,950 గా ఉంది. హైదరాబాద్ లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం రూ. 48,800 కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,800 గా ఉంది. ఇక కిలో వెండిపై 100 రూపాయాలు పెరిగింది. పెరిగిన ధరతో కలిపి కేజీ వెండి రూ. 72,100గా ఉంది.