Telugu News » Ap » Ghora road accident in east godavari district
Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
జాతీయ రహదారిపై ఆగి వున్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్ద చోటు చేసుకుంది. ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. రాజమహేంద్రవరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మహిళ, యువకుడు చనిపోయారు. కారులో ఉన్న మిగతా ముగ్గురు గాయపడటంతో వారిని అంబులెన్స్ లో తుని ఆస్పత్రికి తరలించారు. మృతులను రాజమహేంద్రవరానికి మహిళ పట్నాల […]
జాతీయ రహదారిపై ఆగి వున్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్ద చోటు చేసుకుంది. ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. రాజమహేంద్రవరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మహిళ, యువకుడు చనిపోయారు. కారులో ఉన్న మిగతా ముగ్గురు గాయపడటంతో వారిని అంబులెన్స్ లో తుని ఆస్పత్రికి తరలించారు. మృతులను రాజమహేంద్రవరానికి మహిళ పట్నాల రాము, రమణ (21) గా గుర్తించారు.