
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనే ఇవాళ అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ జేమ్స్ సి మెక్ కాన్ విల్లేతో ఫోన్ లో మాట్లాడారు. ధ్వైపాక్షిక సైనిక సహకారంతో పాటు కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురూ ప్రధానంగా చర్చించారు. ప్రాంతీయ భద్రతా పరిణామాల నేపథ్యంలో భారత, అమెరికా సైన్యాల మద్య సహకారంపై జనరల్ ఎంఎం నరవనే, జనరల్ మెక్ కాన్ విల్లే చర్చలు జరిపినట్టు అధికారులు వెల్లడించారు. గత కొన్నెళ్లుగా భారత- అమెరికా సైన్యాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న విషయం తెలిసిందే.