
చైనాలో భారీ గ్యాస్ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా వంద మందికి పైగా గాయపడ్డారు. సెంట్రల్ చైనాలోని హుబీ ప్రావిన్స్ షియాన్ నగరంలోని జాంగా్వన్ జిల్లాలో ఆదివారం గ్యాస్ పేలుడు సంభవించింది. వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది 150 మందిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన 39 మందిని ఆసుపత్రులకు తరలించారు. నివాసిత ప్రాంతంలో జరిగన గ్యాస్ పేలుడు తీవ్రతకు పలు ఇండ్లు కూడా దెబ్బతిన్నాయి.