https://oktelugu.com/

Sukumar and Allu Arjun : సుకుమార్, అల్లు అర్జున్ ల మీద ఫైర్ అయిన గరికపాటి? ఇంతకీ ఏం జరిగిందంటే?

ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అవసరం లేదు. నిజ జీవిత సత్యాలపై ఆయన వేసే ఛలోక్తులు కొందరిని సూటిగా ప్రశ్నించినట్టే ఉంటాయి. కానీ ఎంతో మందికి కనెక్ట్ కూడా అవుతుంటాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 22, 2024 / 11:41 AM IST

    Garikapati fired on Sukumar and Allu Arjun? What happened so far?

    Follow us on

    Sukumar and Allu Arjun :ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అవసరం లేదు. నిజ జీవిత సత్యాలపై ఆయన వేసే ఛలోక్తులు కొందరిని సూటిగా ప్రశ్నించినట్టే ఉంటాయి. కానీ ఎంతో మందికి కనెక్ట్ కూడా అవుతుంటాయి. నవ్విస్తూనే పంచులు విసరడంలో ఆయన దిట్ట. కానీ ఆ పంచుల్లోంచి ఫైనల్ గా నీతి వాక్యాలు చెప్పాలంటే గరికపాటి తర్వాతనే ఎవరైనా. ఈయన  ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటారు. అలాంటి గరికపాటి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మరి గరికపాటి ఏదైనా అదే విధంగా మాట్లాడుతారు కదా ఇప్పుడు స్పెషల్ గా వైరల్ ఏంటి అనుకుంటున్నారా? ఓ హీరో డైరెక్టర్ గురించి కామెంట్లు చేశారు. ఇంతకీ ఏంటంటే?

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప ది రూల్ మూవీ’ విడుదలకు మరో రెండు వారాలు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు సినిమా గురించి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా సినిమా రేంజ్ ను పెంచేలా, హైప్ ను కలిగించేలా ఉంది. ఎక్కడ చూసినా కూడా పుష్ప ఫీవర్ కనిపిస్తుంది. పాట్నాలో ఘనంగా పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇక ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ 24 గంటల్లో 44.67 మిలియన్ల వ్యూస్ ను సంపాదించి ఏకంగా రికార్డు సొంతం చేసుకుంది.

    ఈ సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్, భన్వర్ సింగ్ షెకావత్‌గా ఫహద్ ఫాజిల్‌, శ్రీవల్లిగా రష్మిక మంధాన నటించారు. పుష్ప పార్ట్ 1లో వీరే నటించారు. ఇప్పుడు ఈ పార్ట్ 2లో కూడా వీరే కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో శ్రీలీల నటిస్తుంది. అయితే సాంగ్ కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియా తెగ హల్ చల్ చేస్తుంది. అయితే గరికపాటి తాజాగా ‘పుష్ప’రాజ్ పై ఫైర్ అయ్యారు. శ్రీరాముడు, హరిశ్చంద్రుడు తగ్గేదేలే అంటే అర్థం ఓ అర్థం ఉంటుంది కానీ పుష్ప లాంటి స్మగ్లర్ తగ్గేదేలే అంటే సమాజం చెడుపోతుందని విమర్శించారు గరికపాటి. అంతేకాదు ఇడియట్, రౌడీ పేర్లతో సినిమాలను తెరకెక్కిస్తూ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అంటూ ప్రశ్నించారు.

    సమాజంలో మార్పు కోసం మాత్రమే తాను తాను ప్రవచనాలను చెబుతున్నాను అన్నారు. అయితే సినిమా క్లైమాక్స్ లో మాత్రం హీరోను మంచి వ్యక్తిగా చూపిస్తే సరిపోతుందా? అంటూ మండిపడ్డారు. అంతేకాు సెకండ్ పార్ట్ రిలీజయ్యేలోపు సమాజం చెడిపోదా అని కూడా ఫైర్ అయ్యారు. ఎవరైనా పిల్లవాడు మరో వ్యక్తి గూబ మీద కొట్టి తగ్గేదేలే అంటే ఎలా అన్నారు గరికపాటి. ఈ ప్రశ్నలకు ఆ హీరో గానీ, డైరెక్టర్ గాని సమాధానం చెప్పాలి అని గతంలో గరికపాటి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇప్పుడు మళ్లీ కామెంట్లు చేశాడు అంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో బన్నీ అభిమానులు గరికపాటి మీద సీరియస్ అవుతున్నారు.

    మొత్తం మీద నేషనల్ అవార్డు విన్నర్ పుష్పకు స్వీకెల్‌గా రూపొందుతుంది ‘పుష్ప ది రూల్’. ఈ సినిమా 2024 డిసెంబర్ 6న రిలీజ్ అవడానికి సిద్దం అయింది. పుష్ప 2 సినిమా రిలీజ్ కోసం దేశవ్యాప్తంగా అభిమాపేలు తెగ వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా బన్నీకి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.