
కరోనా కేసులు వెలుగు చూడటంతో 5వ టెస్టు రద్దయిన విషయం తెలిసిందే. తీవ్ర గందరగోళం అనంతరం మ్యాచ్ ను రీషెడ్యూల్ చేయనున్నట్లు రెండు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి. అయితే.. సిరీస్ తో సంబంధం లేకుండా 5వ టెస్టును విడిగా నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై గంగూలీ స్పష్టతనిచ్చాడు. సిరీస్ కు కొనసాగింపుగానే 5వ టెస్టు మ్యాచ్ ఉండాలని, ఇది ఒక్క టెస్టు కాదని స్పష్టం చేశాడు.