
గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ కరోనా నుంచి కోలుకున్నాడు. గత నెల 22 న కరోనా బారిన పడిన ఆయన ఏప్రిల్ 24న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరాడు. అప్పటి నుంచి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కరోనా నుంచి బయటపడంతో వైద్యులు ఆయనను దవాఖాన నుంచి డిశ్చార్జీ చేశారు. దీంతో పోలీసులు మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. కాగా ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఛోటా రాజన్ మరణంపై ఊహాగానాలు చెలరేగాయి. ఈనెల ప్రారంభంలో గ్యాంగ్ స్టర్ చనిపోయినట్లు సోషల్ మీడియాో వార్తలు వచ్చాయి.