Gali Janardhan Reddy: ఓబుళాపురం అక్రమ మైనింగ్ నలుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు, ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ కు బెయిల్ ఇచ్చింది. ఈ నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, రూ 10 లక్షల సొంత పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది. పదిహేనేళ్ల పాటు సుధీర్ఘంగా సాగిన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో మే 6న నాంపల్ల సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది.