
రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని కాలేజీల్లోనూ ఈ ఆదేశాలు అమలవనుండగా.. తెలుగు మీడియం పూర్తిగా కనుమరుగుకానుంది. విద్యార్థులంతా ఇంగ్లీష్ మీడియంలోనే ప్రవేశాలు పొందాలి. గతేడాది ఢిగ్రీ ఫస్టియర్ లో 2.62 లక్షల మంది చేరగా.. 65,701 మంది తెలుగు మీడియం ఎంచుకున్నారు.