
కరోనా ని అడ్డుకునేందుకు ఉన్న ఏకైక మార్గం లాక్ డౌనేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. లాక్ డౌన్ సమయంలో న్యాయ్ పథకం ద్వారా పేదలకు చేయూతనందివచ్చని తెలిపారు. పరిస్థితి తీవ్రతను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అర్థం చేసుకోవడం లేదన్నారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరి అనేక మంది అయాయక ప్రజలను చంపేస్తోందని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రాలు తీసుకునే ప్రయాణాలపై ఆంక్షలు, కర్ఫ్యూ వంటి నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుందని పేదలకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని కాంగ్రెస్ అభిప్రాయపడింది.