
నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రాజుపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారిని కాపాడేందుకు యత్నించి ఖలీల్ (45) అనే వ్యక్తి కూడా మృతి చెందాడు. మృతులను హేయంత్ (6) చరణ్ తేజ(8) జాహ్నవి (12) గా గుర్తించారు. వీరి కుటుంబాలు రాజుపాలెం హైవే వద్ద దుకాణం నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాయి.