
కడప జిల్లాలోని వల్లూరు మండలం పుష్పగిరి వద్ద పెన్నానదిలో నలుగురు పిల్లలు గురువారం గల్లంతయ్యారు. నిన్నటి నుంచి పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా, ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతులను అబ్దుల్ రషీద్ (18), జవేరియా (12) అనుస్ ఖాన్ (15) ఉన్నారు. వీరిలో ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఉన్నారు. అబ్దుల్ వలీద్ ఖాన్ మృతదేహం లభ్యం కాలేదు. మృతదేహాలను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కడప పట్టానికి చెందిన రెండు కుటుంబాలు పిక్ నిక్ నిమిత్తం గురువారం పుష్పగిరి వచ్చారు. ఈ క్రమంలోనే నదిలో ఆడుకుంటుండగా నలుగురు గల్లంతయ్యారు.