
భారత్ క్రికెట్ జట్టు రిజర్వ్ బెంచ్ బలంపై పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హాక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాకు ఆడేందుకు కనీసం 50 మంది ఆటగాళ్లు రెడీగా ఉన్నారని, ఈ పరిస్థితి 1990, 2000 దశకాల్లో ఆస్ట్రేలియా కూడా లేదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్ ను శాశిస్తున్న రోజుల్లో ఆ దేశం తరఫున రెండు బలమైన జట్లు సాధయపడలేదని, భారత్ మాత్రం ఆ దిశగా దూసుకుపోతుందని తెలిపాడు. కోహ్లీ నేతృత్వంలో 23 మంది సభ్యులతో కూడిన భారత్ జంబో జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తుంటే, అంతే బలమైన మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు సిద్ధమవడం బట్టి చూస్తే భారత్ క్రికెట్ ఏ స్థాయిలో ఉందో సుస్పష్టమవుతుందని అన్నాడు.