సుడిగాలి సుధీర్ కి బుల్లితెర పై విపరీతమైన క్రేజ్ ఉంది. మహిళా ప్రేక్షకులు కూడా అతని అల్లరిని ఇష్టపడుతూ ఉంటారు. ఇక సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గత కొన్ని నెలలుగా వస్తోన్న పుకార్ల పరంపరకు బ్రేక్ లు పడటం లేదు. ఈ రూమర్ల పై గతంలోనే సుధీర్ క్లారిటీ ఇచ్చినా, రష్మీ గౌతమ్ తో ప్రేమలో మునిగి తేలుతున్నాడంటూ వచ్చే రూమర్లకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతుంది.
అయితే, ఇటీవలె సుధీర్ తన 34వ బర్త్ డే ను జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సుధీర్ పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అయింది. కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి పై క్లారిటీ ఇచ్ఛాడు సుధీర్. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదని, మరో రెండేళ్ల వరకు బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాని చెప్పుకొచ్చాడు.
ఈ మధ్య హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి, తానూ హీరోగా కూడా సక్సెస్ అయ్యాక, పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట సుధీర్. ఎలాగూ బుల్లి తెర పై సూపర్ సక్సెస్ అయ్యాడు కాబట్టి, వెండితెరను టార్గెట్ చేశాడు. అయితే, బాక్సాఫీస్ వద్ద సుధీర్ హీరోగా నిలబడటం అంటే సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ లాంటి రెండు సినిమాలు చేశాడు.
ఆ రెండు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి పులిచర్ల అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ‘గాలోడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆల్ రెడీ ఈ సినిమా ఫస్ట్‌లుక్ ను కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం. పలు టీవీ షోలు, ఈవెంట్లతో పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్ మరి హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.