
బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ముఖ్యమంత్రి సారధ్యంలోని జేడీయూ పార్టీలో ఆదివారం చేరారు. ఎన్నికల సమయంలో డీజీపీ పదవికి రాజీనామా చెయ్యడంతో రాజకీయాలోకి వస్తారని వస్తున్న ఊహాగానాలకు అనుగుణంగానే ఆయన ముఖ్యమంత్రి సమక్షంలో జేడీయూ కండువా కప్పుకున్నాడు. అయితే ఆయన ఇంకా ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తాడనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. నాకు రాజకీయాల గురించి ఏమీ తెలియదని పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.