
ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కుటుంబంలో మరో విషాధం చోటుచేసుకుంది. కరోనాతో ఎస్వీ ప్రసాద్ మృతిచెంది ఒక్కరోజు గడవక ముందే ఆయన భార్య లక్ష్మీ సైతం చనిపోయారు. ఈ వేకువజామును 3 గంటలకి ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఎస్వీ ప్రసాద్ తో పాటు ఆయన భార్య లక్ష్మీ, ఇద్దరు కుమారులు వర్థన్, శైలేష్ కొవిడ్ బారిన పడ్డారు. తొలుత భార్యభర్తలు సోమాజిగూడలోని ఓ ఆసుపత్రిలో చేరారు. తర్వాత ఇద్దరు కుమారులు కూడా అదే ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఎస్వీ ప్రసాద్, బుధవారం వేకువ జామున లక్ష్మి మృతి చెందారు. ఇద్దరు కుమారుల ఆరోగ్యం నిలకడగా ఉంది.