
ప్రజలందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. కూకట్ పల్లి పరిధిలో లాక్ డౌన్ అమలు తీరును మంగళవారం ఆయన స్వయంగా పరిశీలించి మాట్లాడారు. లాక్ డౌన్ సమయంలో ఎవరూ అనవసరంగా రహదారులపైకి వచ్చి ఇబ్బందులకు గురికావద్దని అన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు తప్పకపాటించాలని కోరారు. అంతకుముందు కేపీ హెబీకాలనీ ఎమ్మార్వో కార్యాలయం నుంచి రోడ్ నెంబర్ వన్ వరకు నడుచుకుంటూ వెళ్లి దుకాణ సముదాయాలను పరిశీలించారు.