
బ్లాక్ ఫంగస్ దేశ ప్రజలను వణికిస్తోంది. ప్రాణాంతక ఫంగస్ సోకి రోగులు కంటిని చూపును కోల్పోగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో బ్లాక్ ఫంగస్ వ్యాక్సిన్ల తో పాటు మందుల కొరతపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఫంగస్ చికిత్సకు వినియోగించే అంఫోటెరిసిస్-బీ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసేందుకు మరో కొత్తగా ఐదు ఫార్మా కంపెనీలకు అనుమతి లభించిందని, మూడు రోజుల్లో అన్ని రకాల అనుమతులు మంజూరు చేయనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.