
బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నగరంలోని ఎస్.ఆర్.నగర్ పరిధి బీకే గూడలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం రైడ్ చేసి నిందితులను పట్టుకున్నారు. వీరి వద్ద నుండి తొమ్మిది బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎస్ఆర్ నగర్ కు చెందిన మెడికల్ ఏజెంట్ వి. వేణుగోపాల్, బంజారాహిల్స్ నివాసి జి. నవీన్, కొత్తపేటకు చెందిన అశోక్ నిజంపేటకు చెందిన ప్రసాద్, కూకట్ పల్లి నివాసి హరీశ్ గా గుర్తించారు.