
మహారాష్ట్రలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాల్గర్ జిల్లాలోని విరార్ నగరంలో విజయ్ వల్లభ కరోనా ఆస్పత్రిలోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని సమాచారం. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది రోగులు సజీవ దహంన అయ్యారు. అందరూ నిద్రలో ఉండటం, మంటలు వేగంగా వ్యాపించడంతో రోగులు బయటకు వెళ్లలేకపోయారు. ఇక మరికొంత మంది రోగులను వేరే ఆస్పత్రులకు తరలిస్తున్నారు సిబ్బంది.