
కరోనా మహమ్మారికి తండ్రి కుమారుడు బలైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వేములవాడ పట్టణానికి చెందిన గుమ్మడి ప్రకాశ్ (45) వేములవాడలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మూడు రోజుల క్రితం వీరంతా పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ పాజిటివ్ వచ్చింది. ప్రకాశ్ కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. మిగత ముగ్గురు సిరిసిల్ల లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో అభిజిత్ (18) మంగళవారం రాత్రి మరణించాడు. ఒకే రోజు తండ్రి, కుమారుడు మరణిండంతో ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది.