
తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ లకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు పొడిగించారు. ఈ విషయాన్ని లాసెట్ కన్నీనర్ బీజీ రెడ్డి వెల్లడించారు. ఆలస్య రుసుం లేకుండా జూన్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతికి అడ్డుకట్టవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.