
దేశ రాజధాని డిల్లీలో మే చివరి నాటికి 44 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇందులో ఎనిమిదింటిని కేంద్రం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో కొవిడ్ పరిస్థితి పై విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. గతవారంలో ఉన్న ఆక్సిజన్ సంక్షోభం నుంచి గణనీయంగా మెరుగుపడినట్లు తెలిపారు. బ్యాంకాక్ నుంచి 18 ట్యాంకర్లను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.