
ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టులో టీమ్ ఇండియా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్ లో 278 పరుగులకే ఆలౌలైన కోహ్లీ సేన.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దాంతో ఆతిథ్య జట్టు గెలుపొంది ఈ సిరీస్ ను 1-1 తో సమం చేసింది. 212/2 ఓవర్ నైట్ స్కోర్ తో శనివారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఏ దశలోనూ కనీస పోరాటం చేయలేదు. మ్యాచ్ ప్రారంభమైన పది నిమిషాల నుంచి వికెట్ల పతనం మొదలైంది. రాబిన్ సన్ నిప్పులు చెరిగే బంతులు వేయడంతో టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూకట్టారు.