
అమెరికా దిగ్గజ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ కు భారత్ లో అత్యవసర వినియోగ అనుమతులు పొందింది. జాన్సన్ టీకాకు అత్యవసర అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారత్ తన టీకా పరిధిని విస్తరించింది. జాన్సన్ అండ్ జాన్సన్ కు చెందిన సింగిల్ డోసు టీకా అత్యవసర వినియోగ అనుమతులు పొందింది. దీంతో భారత్ లో అత్యవసర వినియోగం కోసం ఆమోదం పొందిన టీకాల సంఖ్య ఐదుకు చేరింది. కరోనా పై మన దేశం జరుపుతోన్న పోరాటానికి ఇది తోడ్పాటునివ్వనుంది అని మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు.