
టీమ్ ఇండియాకు శుభవార్త. కోహ్లీసేనకు రెండు సన్నాహక మ్యాచులు ఏర్పాటు చేసేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అంగీకరించింది. త్వరలోనే తేదీలను నిర్ణయించనుంది. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు రెండు కౌంటీ జట్లతో మ్యాచ్ లు ఏర్పాటు చేసేందుకు ఈసీబీ ముందుకొచ్చింది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, ఇంగ్లాండ్ సిరీసుకు మధ్య టీమ్ ఇండియాకు ఆరు వారాల సమయం ఉంది.