Health News : ప్రతిరోజూ అన్నం తినడం కామన్. చాలా మంది తినరు. కానీ ప్రతిసారి తినడం కూడా మంచిది కాదట. కొన్ని సందర్భాల్లో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. కొంతమంది రోజుకు మూడు పూటలా అన్నం మాత్రమే తింటారు. టిఫిన్, చపాతీ వంటివి తీసుకోరు. నిజానికి అన్నం ఎక్కువగా తినడం కూడా హానీకరమేనట. 60 సంవత్సరాలు పైబడిన వారు అన్నం తినవద్దు. లైట్ తీసుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయట. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, ఎక్కువగా అన్నం తినడం వల్ల కొంతమందిలో దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నట్టు తేలిందట. మరి ఆ వ్యాధులు ఏంటో తెలుసుకుందామా?
ఊబకాయం: ఎక్కువ అన్నం తినడం కూడా మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఇలా తినడం వల్ల కూడా సమస్యలు ఎదుర్కోవాలి. అన్నం ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ విపరీతంగా పెరుగుతాయి. అలాగే శరీర బరువు పెరిగుతుంది. అంతేకాదు కొవ్వు శాతం రెట్టింపు అవుతుంది. ఇది ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశం ఎక్కువ ఉంటుంది.
మధుమేహం: అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువ సార్లు తీసుకోవద్దు. లేదంటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగుతాయి. దీంతో డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పటికే మధుమేహంతో బాధపడే వారికి రక్తంలో చక్కెర స్థాయి పెరిగుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
జీర్ణ సమస్యలు: అన్నం ఎక్కువగా తింటున్నారా? మూడు పూటలు కూడా తింటున్నారా? అయితే మీకు జీర్ణ సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఈ విషయం రీసెంట్ అధ్యయనాలు చెబుతున్నాయి. అజీర్ణం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందట. ఇప్పటికే అనేక రకాల పొట్ట సమస్యలతో బాధపడేవారు అన్నం తినకుండా ఉండటమే మంచిది.
గుండె వ్యాధులు: అన్నం ఎక్కువగా తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే శరీరంలో అకస్మాత్తుగా షుగర్ లెవెల్, కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
కాలేయ వ్యాధులు: అన్నం ఎక్కువగా తింటే దీని వల్ల విడుదల అయ్యే రసాయనాలు కాలేయంపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను తెస్తుంది. కాలేయం దెబ్బతినడంతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.
శరీరం బలహీనత: ఎక్కువ మొత్తంలో అన్నం తింటే శరీరానికి కార్బోహైడ్రేట్లు ఎక్కువ వస్తాయి. దీనివల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే పోషకాలు తగినంత పరిమాణంలో లభించవు. దీని వల్ల శరీర బలహీనత వంటి సమస్యలు, చిన్న చిన్న పనులకే తరచుగా శరీరం శక్తిని కోల్పోతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..