Winter Season : తేనె వల్ల చర్మానికి మంచి అందం వస్తుంది. ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అందానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా తేనె వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చలికాలంలో తేనె తింటే కూడా మరిన్ని ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది సీజనల్ వ్యాధులకు మంచి ఔషధం అంటున్నారు నిపుణులు. తేనెలో ఉండే వివిధ పోషకాలు ముఖ్యంగా చలికాలంలో అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.. తేనె అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో తేనె తింటే జలుబు, దగ్గు నుంచి రక్షిస్తుంది. అంతేకాదు తేనె బరువును అదుపులో ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుందిఈ తేనె. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి కూడా దూరంగా ఉండవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడంతోపాటు ..గుండె జబ్బులు, చర్మ, దంత సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
తేనెలో ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు ఎక్కువ ఉంటాయి. తేనెలోని గుణాలు అంటు వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తాయి. రెగ్యులర్ గా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగి ఎలాంటి వ్యాధులను రాకుండా చూస్తుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. దీని వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుమొఖం పడతాయి అంటున్నారు నిపుణులు. ఒక చెంచా తేనె, ఒక చెంచా లవంగం పొడిని తీసుకోవాలి. దీని వల్ల ఆరోగ్యానికి మంచిది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి వ్యాధులతో పోరాడటంలో సహాయం చేస్తాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యను దూరం చేస్తాయి.
హెర్బల్ టీలో తేనె కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే మానసిక సమస్యలు తగ్గుతాయి. శరీరంలో పేరుకుపోయిన ట్యాక్సిన్స్ బయటకు వెళ్తాయి అంటున్నారు నిపుణులు. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్దకం, పొట్ట సంబంధిత వ్యాధుల నుంచి బయటపడేలా చేస్తుంది తేనె. రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా తేనె కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే అజీర్ణం మలబద్ధకం సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్, ఒక చెంచా తేనె కలిపాలి. ఈ మిశ్రమం వల్ల సైనస్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.. ఒక చెంచా తేనె, అర చెంచా దాల్చిన చెక్క పొడి, అర చెంచా అల్లం రసం కలిపి ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ కరుగుతుంది. చలికాలంలో ప్రతిరోజూ తేనె తీసుకుంటే మంచినిద్రతో వస్తుంది. అంతే కాదు ఒత్తిడి కూడా తగ్గుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు