
బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పేలిన కారణంగా యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపుర్ జిల్లా చౌమూలో శుక్రవారం జరిగింది. మృతుడు ఉదయ్ పుర గ్రామానికి చెందిన రాకేశ్ నాగర్ గా పోలీసులు గుర్తించారు. ఇయర్ ఫోన్స్ ను కనెక్ట్ చేసుకుని రాకేశ్ మాట్లాడుతున్న సమయంలో అవి పేలాయి. దీంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇయర్ ఫోన్స్ పేలిన సమయంలో రాకేశ్ కి గుండెపోటు వచ్చి ఉంటుందని.. ఆ కారణంగానే రాకేశ్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు భావిస్తున్నారు.