Duvvada Srinivas : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అయినా సరే జగన్మోహన్ రెడ్డి పట్ల ఆరాధనాభావంతోనే ఉన్నారు. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అవుతానని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో మిగతా సీనియర్ల అభ్యంతరాలతో జగన్మోహన్ రెడ్డి దువ్వాడను దూరం పెడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు అదే దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం ఇచ్చినంత పని చేశారు. తనను పార్టీలోకి తీసుకోవాలని.. లేకున్నా తాను వచ్చే ఎన్నికల్లో రంగంలోకి ఉంటానని చెప్పారు. కుటుంబ వ్యక్తిగత వ్యవహార శైలి తోనే దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు తమిళనాడులో విజయ్ గెలుపుతో ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నానని చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్.
* వ్యక్తిగత వ్యవహారంతోనే సస్పెన్షన్…
దువ్వాడ శ్రీనివాస్ కు భార్యతో పాటు పిల్లలు ఉన్నారు. కానీ ఆయన దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబ వివాదంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు విజయ్ గెలుపును ఉదహరిస్తున్నారు దువ్వాడ. విజయ్ వ్యక్తిగత కుటుంబ వివాదం సైతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నటి త్రిష తో విజయ్ కు ఉన్న సంబంధం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ముందు విజయ్ భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. అయినా సరే అక్కడ తమిళనాడు ప్రజలు విజయ్ ను గెలిపించారు. ఇప్పుడు విజయ్ మాదిరిగా తనను కూడా ప్రజలు గెలిపిస్తారని చెబుతున్నారు దువ్వాడ.
* ప్రజలు ఆదరిస్తారని..
వ్యక్తిగత జీవితంతో రాజకీయాలకు ముడిపెట్టకూడదు అనేది దువ్వాడ శ్రీనివాస్ అభిప్రాయం. విజయ్ ను తమిళ్ నాడు ప్రజలు గెలిపించారని… తనను కూడా శ్రీకాకుళం జిల్లా ప్రజలు గెలిపిస్తారని నమ్మకం గా చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పటికే విజయ్ గెలుపుతో సంబరాలు చేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సైతం విజయ్ ను గుర్తుచేస్తూ.. తనను ప్రజలు ఆదరిస్తారని చెబుతున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అభిప్రాయం మాత్రం వేరేలా ఉందన్న ప్రచారం జరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీలోకి తీసుకుంటే.. శ్రీకాకుళం జిల్లాలో బలమైన నేతలు బయటకు వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తోంది.