https://oktelugu.com/

AP DSC 2024 : ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ జాప్యం.. కారణం అదే!

భారీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈనెల 4న 13,336 ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయాలని భావించింది.కానీ ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో వాయిదా పడింది.

Written By:
  • Dharma
  • , Updated On : November 8, 2024 / 12:28 PM IST

    AP DSC 2024

    Follow us on

    AP DSC 2024 :  ఏపీలో ఎస్సీ వర్గీకరణకు సిద్ధపడుతోంది కూటమి సర్కార్.అందుకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించింది.ఆది నుంచి ఎస్సీ వర్గీకరణకు టిడిపి అనుకూలంగా ఉంది.ఈ విషయం చాలా సందర్భాల్లో బయటపడింది.అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు అడుగులు వేస్తోంది కూటమి సర్కార్. అందులో భాగంగా దళిత నేత మందకృష్ణ మాదిగను పిలిపించి మాట్లాడింది. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి వంగలపూడి అనిత తో పాటు ఎస్సీ ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వర్గీకరణ ఎలా చేయాలో నిర్ణయించారు. రాష్ట్రాన్ని, జోన్ ను, జిల్లాను ఒక్క యూనిట్గా తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎందుకోసం త్వరలో ఓ కమిషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీని నివేదిక కూడా నెల రోజుల్లోపే అందించేలా లక్ష్యం విధించారు. డీఎస్సీ తో పాటు ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో భాగంగా జనాభా ప్రాతిపదికన జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిలో పోస్టులను విభజించనున్నారు.

    * ప్రధాన కులాల్లోకి ఉప కులాలు
    అయితే ఎస్సీ వర్గీకరణతో ప్రస్తుతం ఉన్న ఏబిసిడి రిజర్వేషన్ల స్థానంలో.. ఏబీసీ మాత్రమే కొనసాగించాలని దళితప్రజా ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు కోరినట్లు తెలుస్తోంది.ఉప కులాలను ప్రధాన కులాల్లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయాలనిభావిస్తున్నట్లు సమాచారం.రాష్ట్రంలో ఎస్సీ జనాభా ఆధారంగానే రిజర్వేషన్ అమలుకు పట్టు పట్టినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణతో దళితుల్లో ఒక రకమైన విభజన కనిపిస్తోంది. అందుకే సున్నితమైన అంశం కావడంతో చాలా జాగ్రత్తగా సమస్యకు పరిష్కారం సూచించాలని భావిస్తున్నట్లు సమాచారం.

    * జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం
    వైసీపీకి ఎస్సీలు ప్రధాన ఓటు బ్యాంకు గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కొంతవరకు కూటమి వైపు మొగ్గు చూపారు. అందుకే ఈ విషయంలో టిడిపి సైతం చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో తొందరపాటు చర్యలకు దిగితే వైసిపి ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది. అందుకే ముందుగా కూటమి లోనే ఎస్సీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు చంద్రబాబు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం అయ్యింది. అయితే డిసెంబర్ లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అందుకే వీలైనంతవరకు ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలని భావిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.