Mangli Birthday Party: సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న హైదరాబాద్ శివార్లో జరిగిన ఆమె బర్త్ డే వేడుకల్లో గంజాయి, విదేశీ మద్యం వినియోగంపై సమాచారంతో దాడులు చేశారు. ఇందులో 11 మంది గంజాయి సేవించినట్లు తెలుస్తోంది. వీరిలో మంగ్లీ ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు మంగ్లీతో పాటు నిర్వాకులపై కేసు నమోదు చేశారు.