Mother blessing Rs.15,000 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థుల తల్లుల ఖాతాలలో ఏడాదికి రూ.15 వేలు డబ్బులు జమ కానున్నాయి. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను పొందాలి అంటే లబ్ధిదారులందరూ కూడా ఇప్పటికే హౌస్ డేటా బేస్ లో పిల్లల వివరాలను నమోదు చేసుకోవడం, ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం అలాగే తమ ఆధార్ కార్డుతో ఎన్ పి సి ఐ లింక్ చేసుకోవడం వంటివి తప్పనిసరిగా చేయాలి అంటూ ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు రెడీగా ఉంది.
ఈ క్రమంలో సూపర్ సిక్స్ పథకాలలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెలలోనే ప్రభుత్వం తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నెలలోనే స్కూల్స్ రీ ఓపెన్ అవుతున్న సమయంలో ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించేందుకు పూర్తిగా కసరత్తు చేస్తుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించబోతుంది. ఈ పథకం కింద ప్రతి ఏడాది కూడా విద్యార్థుల తల్లుల ఖాతాలలో రూ.15 వేల రూపాయలు జమ చేస్తుంది. కానీ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను పొందాలంటే మీరు ముఖ్యంగా మూడు పనులను పూర్తి చేయాలి అని ప్రభుత్వం వాళ్లను సూచిస్తుంది. తల్లికి వందనం పథకం ప్రయోజనాలు పొందాలి అంటే ముఖ్యంగా తల్లులతోపాటు పిల్లల వివరాలు కూడా హౌస్ హోల్డ్ డేటా బేస్ లో నమోదు చేసుకోవాలి. హౌస్ హోల్డ్ లో ఈ కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేయాలి.
Also Read : ఏపీ ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.. ప్రతి ఒక్కరికి రూ.2 లక్షలు…
ఒకవేళ ఇప్పటివరకు ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళు వెంటనే హౌస్ హోల్డ్ డేటాబేస్ లో పిల్లల పేరును నమోదు చేయడంతో పాటు ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. వెంటనే స్థానిక అధికారులను సంప్రదించి ఈ ప్రక్రియలను పూర్తి చేయాలి అని ప్రభుత్వం తెలిపింది. హౌస్ హోల్డ్ డేటా బేస్ లో నమోదు చేసుకున్న వాళ్లకు మాత్రమే ఖాతాలో రూ.15000 జమ చేస్తారని అధికారులు తెలిపారు. అలాగే తల్లుల ఖాతాలు ఈకేవైసి ప్రక్రియ కూడా పూర్తి అయి ఉండాలి. ఎన్పీసీఐ లింకింగ్ కూడా తప్పకుండా చేసుకొని ఉండాలి.