
అమెరికా ప్రముఖ టెలివిజన్ షో ది వైర్ సిరీస్ నటుడు మైఖేల్ కె విలియమ్స్ (54) న్యూయార్క్ లో మరణించాడు. రెండు రోజులుగా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మైఖేల్ దగ్గరి బంధువు ఆయన అపార్ట్ మెంట్ కు వెళ్లి చూడగా.. డ్రగ్స్ ప్యాకెట్ల మధ్య ఆయన మృతదేహాం కనిపించింది. డ్రగ్స్ ఓవర్ డోసు వల్లే ఆయన చనిపోయాడని ప్రాథమిక నిర్ధారణలో తేలింది. దివైర్ లో ఓమర్ లిటిల్ గా మైఖేల్ వేల మంది అభిమానులను సంపాదించుకున్నాడు.