Vyjayanthi Mala :వైజయంతి మాల..ఈ పేరు వినే ఉంటారు. దీన్ని పెర్ల్ ప్లాంట్ అని పిలుస్తారు. కొందరు కవాడో అని కూడా అంటారు. ముఖ్యంగా వైష్ణవ వర్గానికి చెందిన వారు ఈ మొక్క పువ్వులతో శ్రీకృష్ణుడికి పూజలు చేస్తుంటారు. పువ్వు వికసించే ముందు మొగ్గలను కోస్తారు. వాటిని ఎండబెట్టి, వాటితో దండలు తయారు చేసి దేవుడికి వేస్తారు. వీటినే వైజయంతీ మాల అంటారు. ఈ హారాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది. ఈ మాల అంటే ఆ శ్రీకృష్ణుడికి చాలా ప్రీతి అని నమ్ముతారు.
గ్లాస్ ల్యాండ్ ప్రాంతాల్లో ఈ మొక్క చాలా పెరుగుతుంది. నీటి ఎద్దడి ఉన్న ప్రదేశాల్లో కూడా బాగా పెరుగుతుంది. గుజరాత్‌లో ముఖ్యంగా కచ్ ప్రాంతంలో దీన్ని ఎక్కువగా చూడవచ్చు. దీని శాస్త్రీయ నామం Coix Lacryma-Jobi. ఇది గడ్డి వర్గానికి చెందిన మొక్క. ఇది గడ్డి లేదా చిన్న చెట్టు ఆకారంలో మాత్రమే పెరుగుతుంది. ఈ మొక్క 120-180 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. పొడవైన ఆకులను కలిగి ఉంటుంది ఈ మొక్క. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు పండ్లు కాస్తాయి. పువ్వులు పూస్తాయి.
ప్రయోజనాలు: ఈ మొక్క పండ్లు ఆరోగ్యాన్ని అందిస్తాయి. దీని పండు ఆయుర్వేద చికిత్సల్లో వినియోగంలో ఉంది. ఊపిరితిత్తులలోని సమస్యల కోసం దీనిని తీసుకుంటారు. దీని వల్ల మంట, ఇన్‌ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. మూత్ర సంబంధిత వ్యాధుల చికిత్సలోనూ చాలా ఉపయోగంలో ఉంది. దీని యాంటీ-వైరల్ లక్షణాలు వైరస్ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి.
గిలోయ్ వంటి రోగనిరోధక మాడ్యులేటర్‌గా పనిచేస్తుంది ఈ మొక్క. చర్మ సంబంధిత ఆయుర్వేద క్రీముల్లోనూ ఈ మొక్క సారం మంచి పాత్ర పోషిస్తుంది. చర్మ ఆరోగ్యానికి చాలా మేలు సూప్, టీ వంటివి చేసుకొని తాగాలి. దీని వల్ల శరీరానికి మంచి పోషకాలను అందితాయి. ఈ మొక్కలో ఫ్లేవనాయిడ్స్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
శ్రీకృష్ణ జయంతి నాడు వైజయంతి మాల వల్ల మీరు మీ ఇంటి చాలా దిశలను మార్చుకోవచ్చు. ఈ రోజు ఈ మాలను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. చాలా సమస్యలు తొలిగిపోతాయి అంటున్నారు పండితులు. ఇదంటే ఆ చిన్న కన్నయ్యకు చాలా ఇష్టమట. అందుకే ఆ రోజు ఇంటికి వైజయంతి మాలను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలి. దీని వల్ల ఆ ఇంట్లోనే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. కృష్ణాష్టమి పండుగ నాడు కృష్ణుడికి ఇష్టమైన వెన్నను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. కృష్ణుడికి వెన్నను, పాలను సమర్పించి పూజిస్తూనే ఈ వైజయంతి మాలను అర్పించాలి. తనకు ఇష్టమైనవి సమర్పించడం వల్ల ఆ గోపాలుడు మన కోరికలను తీరుస్తాడు అంటున్నారు పండితులు