https://oktelugu.com/

Balakrishna & Mohan Babu : ఆ సినిమాలో మోహన్ బాబు చేయాల్సిన పాత్రను బాలకృష్ణ చేశాడనే విషయం మీకు తెలుసా..?

ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు

Written By:
  • Gopi
  • , Updated On : November 22, 2024 / 04:46 PM IST

    Do you know that Balakrishna played the role of Mohan Babu in that movie?

    Follow us on

    Balakrishna & Mohan Babu : ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి దానికంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న వీళ్ళు తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…

    తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో చాలామంది హీరోలు ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ అప్పిరియాన్స్ ఇస్తు వస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది హీరోలు గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్నప్పటికి ఇంతకుముందు జనరేషన్ లో ఉన్న చాలా మంది హీరోలు కూడా ఇలాంటివి చేస్తూ వచ్చారు. మరి వాళ్ళలో కొంతమంది కొన్ని క్యారెక్టర్లని చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంటే మరి కొంత మంది మాత్రం ఆ క్యారెక్టర్లతో పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయారు. ఇక ఇదిలా ఉంటే మనోజ్ హీరోగా వచ్చిన ‘ఊకోడతారా ఉలిక్కి పడతారా’ సినిమాలో బాలయ్య బాబు ఒక ప్రత్యేక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలయ్య నటన తీరు అద్భుతంగా ఉండడమే కాకుండా ఆయన కనిపించినంత సేపు సినిమా లో ఒక వైబ్రేషన్ అయితే మూవ్ అవుతుంది. కానీ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. అయినప్పటికి బాలయ్య చేసిన పాత్రకి మాత్రం మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక మొదట ఈ పాత్రని మోహన్ బాబు చేద్దామని అనుకున్నాడట. కానీ మనోజ్ మాత్రం ఈ పాత్రని బాలయ్య చేస్తే బాగుంటుందని చెప్పి మొత్తానికైతే బాలయ్య బాబు చేతే ఈ పాత్రను చేయించారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో బాలయ్య చేసిన క్యారెక్టర్ హైలెట్ గా నిలిచింది.

    ఇక ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించకపోయినా కూడా బాలయ్య చేసిన ఆ పాత్ర ఇప్పటికి అందరికీ గుర్తుండిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ పాత్రని మోహన్ బాబు చేసి ఉంటే అంత ఇంపాక్ట్ అయితే వచ్చేది కాదు అంటూ సినిమా పండితులు సైతం అప్పట్లో కొన్ని కామెంట్లు అయితే చేశారు. మరి మోహన్ బాబు మాత్రం ఇప్పటికి తను ఆ పాత్ర చేసి ఉంటే ఇంకా బాగా చేసిండే వాడిని అంటూ కొన్ని సందర్భాల్లో తెలియజేయడం విశేషం…

    ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు కొంచెం అతి చేస్తాడనే విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలో బాలయ్య బాబు పోషించిన పాత్రని ఆయనకంటే ఎవరు బాగా చేయలేరని కొంతమంది చెబుతుంటే బాలయ్య బాబు కంటే నేను బాగా చేస్తానని మోహన్ బాబు వాదించడం విశేషం…

    ఇక ఏది ఏమైనా కూడా మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న సినిమాలేవి ప్రస్తుతం ప్రేక్షకులను మెప్పించే పరిస్థితి అయితే లేదు. మరి వాళ్ళు చేస్తున్న సినిమాల్లో కంటెంట్ అంత మంచి ఇంపాక్ట్ ను చూపించకపోవడమే దానికి కారణమని తెలుస్తుంది…