
కరోనా కష్టకాలంలో ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం నిరంతరం పని చేస్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించాలి. అనవసరంగా రోడ్లపైకి ఎవరూ రావొద్దు. వాహనాలు సీజ్ అయితే లాక్ డౌన్ పూర్తయిన తర్వాతే అప్పగిస్తామన్నారు. 99 శాతం లాక్ డౌన్ విజయవంతమైంది. ఈ- పాసులను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హచ్చరించారు.