

దేశంలో కరోనా టీకాల పంపిణీ కొనసాగుతున్నది. టీకాల డ్రైవ్ సోమవారం నాటికి 143 వ రోజుకు చేరగా మొత్తం 23.59 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. 18-22 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తులకు 3.04 కోట్ల డోసులు వేసినట్లు చెప్పింది. సోమవారం రాత్రి 7 గంటల వరకు అందించిన తాత్కాలిక నివేదిక మేరకు ఒకే రోజు 31 లక్షల మోతాదులు అందజేసినట్లు పేర్కొంది.