Dhurandhar 2 box office collection : ‘ధురంధర్ 2′(Dhurandhar 2: The Revenge) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రోజురోజుకు క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ ని చూస్తుంటే, భవిష్యత్తులో ఈ సినిమా రికార్డ్స్ ని అందుకోవడం రాజమౌళి లాంటోళ్లకు కూడా చాలా కష్టమేమో అని అనిపిస్తోంది. ఆ రేంజ్ బెంచ్ మార్క్స్ ని క్రియేట్ చేసింది ఈ చిత్రం. ‘ధురంధర్’ చిత్రానికి క్లోజింగ్ లో 1300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, ‘దురంధర్ 2’ చిత్రానికి కేవలం 11 రోజుల్లోనే ఆ రేంజ్ వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనేది. అంతే కాదు ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన #RRR కేజీఎఫ్ చాప్టర్ 2 ఫుల్ రన్ రికార్డ్స్ ని కూడా దాటేసింది. ఇది సాధారణమైన విషయం కాదు.
#RRR చిత్రానికి క్లోజింగ్ లో దాదాపుగా 1265 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కేజీఎఫ్ చాప్టర్ 2 కి 1300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, ఈ రెండు రికార్డ్స్ ని అవలీలగా దాటేసింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ సినిమా ముందు ఉన్న టార్గెట్స్ రెండే రెండు. ఒకటి ‘పుష్ప 2’, మరొకటి ‘బాహుబలి 2’. పుష్ప 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి దాదాపుగా 1800 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ‘బాహుబలి 2’ చిత్రానికి 1890 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇవి రెండు కాకుండా చైనా రిలీజ్ తో ‘దంగల్’ చిత్రం 2000 కోట్ల మార్కుని కూడా అందుకుంది. ఈ మూడు సినిమాల వరల్డ్ వైడ్ గ్రాస్ ని ‘ధురంధర్ 2’ చిత్రం కొల్లగొట్టగలదా? లేదా? అనేది చూడాలి.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తుంటే ఈ వారం లోనే ఈ చిత్రం ‘పుష్ప 2’ క్లోజింగ్ కలెక్షన్స్ ని అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత వారం లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రతీ రోజు 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతూ ముందుకెళ్ళేది. ఈ వారం రెండు రోజులకు 100 కోట్ల గ్రాస్ లెక్కన వేసుకున్నా, వీకెండ్ ముగిసే సమయానికి మరో 500 కోట్ల గ్రాస్ ని రాబడనుందని, కాబట్టి ‘పుష్ప 2’ రికార్డుని అవలీలగా దాటేస్తుందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి. నేడు కూడా ఈ చిత్రం బుక్ మై షో యాప్ లో అప్పుడే గంటకు 10 వేల టికెట్స్ అమ్మకం ట్రెండ్ తో మొదలైంది.