
చెన్నైని గెలిపించిన బ్రావో గురించి ఆ జట్టు సారథి మాట్లాడారు. డ్వేన్ బ్రావో పై ప్రశంసల జట్లు కురిపించాడు. బ్రావో ఫిట్ నెస్ బాగుంది. ఇంది మంచి విషయం. తన ప్లాన్ ను పక్కాగా అమలు చేశాడని అన్నాడు. తనని నా సోదరుడిగా భావిస్తాను. బ్రదర్ అని పిలుస్తానని ధోని తెలిపాడు. తను స్లోగా బౌలింగ్ చేసినప్పుడు మా మధ్య గొడవలు జరుగుతాయి. తను టెక్నిక్ తో బాల్స్ వేస్తాడని అందరికి తెలుసు. కాబట్టి ఓకే ఓవర్లో ఆరు వైవిద్యమైన బంతులు విసరాలని సూచించాను అని ధోని తెలిపాడు.
ముఖ్యంగా యార్కర్లు వేస్తే బాగుంటుందని చెప్పాను. ఇంకా బ్రెవో గురించి చెబూతూ0 తనకు ప్రపంచంలోని వివిధ మైదానాల్లో ఆడిన అనుభవం ఉంది. అది మాకు ఎంతగానో ఉపకరిస్తుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో తను ఎల్లప్పుడూ ముందుంటాడని ధోని తెలిపాడు. శుక్రవారం ఆర్సీబీతో షార్జాలో జరిగిన మ్యాచ్ లో ధోని సేన 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తద్వారా పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇక ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మాక్స్ వెల్, హర్షల్ పటేల్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్న డ్వేన్ బ్రావో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్ కే 18.1 ఓవర్లో చేధించింది. సీఎస్ కే ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్ (38), డుప్లెసిస్ (31) పరుగులతో రాణించి రన్ రేట్ పడకుండా జాగ్రత్తా పడ్డారు. వీరిద్దరు ఔటన తర్వాత క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ (23), అంబటి రాయుడు (32) ఇన్నింగ్స్ ను నిర్మించారు. చివర్లో రైనా )16) ధోని (11) పూర్తి చేశారు.