Delhi Riots Conspiracy : దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. అల్లర్ల కుట్రలు పెరుగుతున్నాయి. ఒపవైపు పాకిస్తాన్ వీటిని ప్రోత్సహిస్తోంది. ఇంకోవైపు అమెరికా కూడా ఇలాంటి అల్లర్లకు అండగా నిలుస్తోంది. ఇకోవైపు చైనా కూడా కుట్ర చేస్తోంది. ఇక మన దేశంలోని ప్రతిపక్ష కాంగ్రెస్‌కు గద్దెనెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో 2020లో దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ అల్లర్లపై కొత్త వెలుగులు పడుతున్నాయి. తాజాగా పోలీసులు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన 177 పేజీల అఫిడవిట్‌లో ఈ ఘటన వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలను వివరించారు. ఇది అకస్మాత్తుగా ఉద్భవించిన మత ఘర్షణ కాదని, దేశవ్యాప్తంగా అశాంతి సృష్టించేందుకు నిశితంగా రూపొందించిన పథకమని స్పష్టం చేశారు.
‘‘రెజీమ్ చేంజ్’’ ఆపరేషన్
పోలీసుల నివేదిక ప్రకారం, అల్లర్ల ప్రధాన ఉద్దేశం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరం చేయడమే. నిరసన పేరుతో శాంతి భద్రతలను భంగం చేసి, ఒక పెద్ద రాజకీయ మార్పు తీసుకురావాలనే సంకల్పంతో కొన్ని వర్గాలు వ్యవహరించాయని పేర్కొన్నారు. దీన్ని అధికారులు ‘‘రెజీమ్ చేంజ్ ఆపరేషన్’’గా వర్ణించారు. దర్యాప్తు వివరాల ప్రకారం, ఇది చట్రంలోకి బయట ఉన్న వ్యక్తుల స్వచ్ఛంద చర్య కాదని సమన్వయంగా నడిపిన బృందం కార్యాచరణగా పేర్కొన్నారు. ఆస్సాం నుంచి ముంబై వరకు అల్లర్లు ఒకే వ్యూహం కింద ప్రేరేపించబడినట్లు ఆధారాలు సేకరించారని పోలీసులు చెప్పారు. మొదట ఢిల్లీలో ప్రారంభించి దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు రగిల్చే ప్రయత్నం జరిగిందని స్పష్టమైంది.
ఫర్జీన్ ఇమామ్ నెట్‌వర్క్‌లో భాగం..
ఈ కుట్రలో పలు వ్యక్తుల పేర్లు వెలుగులోకి రావడం గమనార్హం. ఫర్జీన్ ఇమామ్ వంటి కీలక వ్యక్తులు ‘‘క్లిష్ట ప్రణాళిక’’లో ప్రమేయం ఉన్నారన్న ఆధారాలు దాఖలైనట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతీ దశలో పలు సమూహాలు సోషల్ మీడియా, స్థానిక సంఘటనల ద్వారా సమన్వయం సాగించాయని అఫిడవిట్ చెబుతోంది. అల్లర్ల కేసు ఇంతవరకు సామాజిక మత ఘర్షణగా చూడబడుతున్నా, ఈ తాజా దాఖలాతో దృష్టికోణం మారింది. నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు కేంద్ర సంస్థలు సిద్ధం అవుతున్నాయి.అఫిడవిట్ వివరాలు బహిర్గతం కావడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.
దేశ అంతర్గత భద్రతా వ్యవస్థకు పెద్ద సవాలుగా నిలిచిన ఈ పథకం, భవిష్యత్తులో అల్లర్ల నిరోధక వ్యూహాలపై కొత్త మార్గదర్శకాలను నిర్దేశించనుంది. రాజకీయంగా ప్రేరేపిత సంఘటనలు ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తాయో ఢిల్లీ ఘటన మరోమారు గుర్తు చేసింది.