
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,00,001 నమూనాలు పరీక్షించగా కొత్తగా 5,646 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 50 మంది మరణించినట్లు వైద్యారోగ్యశాక బులిటిన్ విడుదల చేసింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 మంది మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 7,772 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 63,068 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది.