
దేశంలో తాజాగా కొత్త కేసులు తగ్గగా.. మరణాలు సుమారు 100 రోజుల కనిష్టానికి క్షీణించాయి. 19,55,910 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 38,949 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 6.8 శాతం తగ్గుదల నమోదైంది. 24 గంటల వ్యవధిలో మరో 542 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3 కోట్ల 10 లక్షలకు చేరాగా 4,12,531 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.