
తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చింది. గత 24 గంటల్లో 1,23,005 మంది నమూనాలు పరీక్షించగా కొత్తగా 1,362 కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ బులిటిన్ విడుదల చేసింది. కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,556కి చేరింది. కరోనా నుంచి నిన్న 1,813 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,568 యాక్టివ్ కేసులు ఉన్నాయి.