
తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 1,24,430 పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,417 కొవిడ్ కేసులు నిర్ధారణకాగా, 12 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంక్య 6,10,834 కి చేరింది. తాజా మరణాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,546 మంది కరోనాతో చనిపోయారు. ఒక్కరోజు వ్యవధిలో 1,897 మంది బాధితులు కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 19,029 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.