నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై లేఖాస్ర్తాలు సంధిస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్న మీరు ప్రజల కోసం ఎందుకు పని చేయరని ప్రశ్నిస్తూ లేఖలు రాస్తున్నారు. ఇప్పటికి ఆయన 9 లేఖలు రాశారు. కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని గుర్తు చేశారు. ఎంపీనని చూడకుండా రాజద్రోహం కేసు పెట్టి జైలుకు పంపడంపై విచారం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ప్రముఖులందరికి ఫిర్యాదు చేస్తూ లేఖలు రాశారు. తనకు మద్దతుగా నిలవాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉంటే ఒకలా లేకుంటే మరోలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. వృద్ధాప్య పింఛన్లు పెంచాలని పేర్కొన్నారు. సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాలని తెలిపారు.
జగన్ అధికారంలోకి రాకముందే మహిళలకు మద్యనిషేధంపై మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ర్టంలో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. మద్యనిషేధంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని విన్నవించారు. గతేడాదితో పోలిస్తే 16 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉండాలని కోరారు.
రఘురామ జగన్ పై రాసే లేఖల కార్యక్రమం నేటితో పూర్తయింది. జగన్ సర్కారుపై రఘురామ తరువత అస్ర్తం ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది. జగన్ సర్కారుకు మనశ్శాంతి లేకుండా చేయడమే ఆయన ఏకైక లక్ష్యం. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.